డైట్ ప్లాన్ కంపల్సరీ : ఆహార పరిమాణాన్ని తగ్గించండి!

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:05 IST)
ఆహారం తీసుకోవడంలో ప్లాన్ అవసరం. ఏవిపడితే అవి తినేయకుండా రోజువారీ తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకే విధమైన ఆహారం తీసుకోవడం కంటే వెరైటీ పోషకాలుండే ఆహారాలు, వాటిలో కెలోరీల శాతం ఎంత అనేది తెలుసుకోండి. 
 
శాకాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ మాంసాహారాన్ని మితంగా తీసుకోండి. తీసుకునే కెలోరీలు ఖర్చవుతున్నాయా? మాంసకృత్తులు గల ఆహారాన్ని తీసుకుంటున్నామా అనేది తెలుసుకోండి. 
 
పనిచేసే సమయంలో ఇంట్లో తయారు చేసిన భోజనానికే ప్రాధాన్యమివ్వండి. హోటల్ ఫుఢ్‌తో ఒత్తిడి, షుగర్ పెరగుతాయి. రోజూ వివిధ రకాల పండ్లు, కూరగాయల ఐదు రకాలను ఆహారంలో తీసుకోవాలి. 
 
అలాగే ఆహారం తీసుకునే పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాలి. ఇది ఆక్సిజన్, నీటిని అందించడం ద్వారా కణాలన్నిటికీ శక్తినిచ్చి సహాయపడుతుంది. 
 
ఆహారాన్ని ఆస్వాదించడానికి, తక్కువ తినడానికి ఉత్తమ మార్గం మెల్లగా తినడం. ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా నమలండి, దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగౌతుంది, కడుపు కూడా నిండుతుంది.
 
ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ వుండండి, అంటే రోజుకి మూడు సార్లు భోజనం, రెండు సార్లు చిరుతిళ్ళు అన్నమాట. ఎక్కువగా తినకుండా ఉండాలంటే సరైన విరామాల్లో ఎక్కువ సార్లు తినండి. ఇలా చేస్తే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి