ఆస్టియోపోరోసిస్ వ్యాధి సైలెంట్ కిల్లర్ లాంటిదని వైద్యులు అంటున్నారు. దీనికి సంబంధించిన లక్షణాలు త్వరగా బయట పడవంటున్నారు వైద్యులు. రోగిలో "బోన్ మాస్" లేదా "బోన్ టిష్యూ"లకు సంబంధించినది అని వైద్యులు చెపుతున్నారు. దీంతో ఎముకలు విరిగే అవకాశం ఉంది.
భారతదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో(మెనోపాజ్ తర్వాత) ఒకరికి, అలాగే పురుషులు(అరవై సంవత్సరాలకుపైబడి)కూడా ఈ వ్యాధిబారిన పడుతుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతుంటాయి. అలా బలహీనంగా తయారైన ఎముకలు విరిగిపోయేందుకు ఆస్కారమెక్కువని వైద్యులు చెపుతున్నారు. ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ళ ఎముకలు విరిగిపోతుంటాయి.
ఇలా ఏ కారణం చేతనైనా ఎముకలు విరగడాన్ని ఎముక విరుపు అంటారు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఎముకలు బలహీనంగా ఉన్నందువలన కూడా విరగవచ్చును. దీనికి తగిన వైద్యం చేసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందంటున్నారు వైద్యులు.