ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయని అందుకే సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా ప్రేక్షకులు రావడంలేదని నిర్మాత గణపతి రెడ్డి వాపోయారు. అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాను ఆయన నిర్మించారు. జులైలో సినిమాను విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న సినిమాలు అసలు బతకడంలేదనీ, అంతా ఓటీటీ మహత్యమేనని విమర్శించారు. ఈ సినిమా తీయడానికి బడ్జెట్ ఎక్కువయిందనీ, అయినా కథ పై నమ్మకంతో పెట్టుబడి పెట్టానని అన్నారు.