దానిమ్మ తొక్కతో చుండ్రుకు చెక్... పండ్ల తొక్కలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!
సోమవారం, 11 జులై 2016 (15:54 IST)
పండ్ల పోషకాల గురించి అందరికీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ పండ్లతో పాటు ఆ పండ్ల తొక్కలలో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని మీకు తెలుసా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏ పండు తొక్క వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుందో తెలుసుకుంటే ఇకపై తొక్కను నిర్లక్ష్యం చేయకుండా.. లాగించేస్తారు. మరి ఆ తొక్కల ప్రాముఖ్యత ఏంటో తెల్సుకుందాం..
పుచ్చకాయ తొక్కలో ఉండే తెల్లటి భాగంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాదు ఈ తొక్కను చర్మంపై రుద్దడం వల్ల చర్మంపై పేరుకున్నమురికి మటుమాయం చేస్తుంది.
బరువు తగ్గడానికి నారింజ తొక్క బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్ స్క్రబ్ లా, బ్లీచింగ్‌లా చర్మాన్ని మెరిపింపజేస్తుంది.
ఎర్రటి దానిమ్మ గింజల్లోనే కాదు.. తొక్కలోనే ఆరోగ్య రహస్యాలున్నాయి. దానిమ్మ తొక్క యాక్ని, పింపుల్స్, చుండ్రు నివారించడంలో బాగా పనిచేస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యానికి, పళ్ల పరిశుభ్రతకి ఉపయోగపడుతుంది.
అరటి తొక్క లోపలి భాగంతో.. పంటిపై రుద్దడం వల్ల పళ్లు న్యాచురల్‌గా తెల్లగా మారుతాయి. అలాగే అరటితొక్కను కాలిన చర్మంపై పెట్టడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది.
యాపిల్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్‌ని నివారించవచ్చు. అయితే యాపిల్ తొక్క తినడం వల్ల ఫ్లేవనాయిడ్స్, కెమికల్స్ క్యాన్సర్ సెల్స్‌ని నాశనం చేస్తుంది. ఇమ్యునిటీని పెంచుతుంది.
నిమ్మ తొక్కలో అనేక ఉపయోగాలున్నాయి. ఇది చర్మంపై న్యాచురల్ మాయిశ్చరైజర్, క్లెన్సర్‌లా పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కలుబరువు తగ్గడానికి, పంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి. క్యాన్సర్‌తో పోరాడే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టాక్సిన్స్‌ని బయటకు పంపి.. ఒత్తిడిని తగ్గిస్తాయి.