సగ్గుబియ్యంలో వున్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సగ్గుబియ్యం బరువు పెరగాలనుకునే వారికి బాగా పనిచేస్తుంది. బరువు పెరగాలనుకునేవారు రోజూ ఓ కప్పు ఉడికించిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు. అలానే సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శాకాహారం తినేవారికి మాంసకృత్తులు తగినన్ని శరీరానికి అందవు.