అంతేగాకుండా సానుకూల దృక్పథం, ఆశావాదాలను పెంచుకోవడంతోపాటు సమస్యలను తేలికగా తీసుకుంటే చాలు.. ఒత్తిడి కారణంగా ఏర్పడే గుండెపోటు తగ్గుతుంది. తద్వారా నిత్యయవ్వనులుగా కనిపిస్తారు. భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా చింతించడం చేస్తే 30 ఏళ్లకే 60 ఏళ్ల వారిగా కనిపిస్తారు.
మెదడులోని భావోద్వేగానికి మానసిక ఆరోగ్యానికి లింకుదని గమనించాలి. సమస్యలను నెత్తినేసుకోకుండా ఓస్ ఇంతేనా అని తీసిపారేస్తే... ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు.. సానుకూల అంశాలపై దృష్టిపెడితే వయసు మళ్లినా చురుకుగా ఉండొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే బీపీ, మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు అధికమవుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.