సంవత్సరంలో మగ, ఆడవారు ఎన్నిసార్లు ఏడుస్తారో తెలుసా..?

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (18:19 IST)
మనసుకు ఏదైనా బాధ కలిగినా.. ఎవరైనా మనల్ని బాధపెట్టేలా మాట్లాడినా తనివితీరా ఏడిస్తే రిలాక్స్ అవుతాం. ఏడవడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలు బయటకుపోతాయి. సినిమా చూసేటప్పుడు ఏడ్చేవారికి, ఏడవని వారికి తేడా ఉంటుందని ఒక పరిశోధనలో తేలిందట. ఏడవడం అలవాటు లేని వారి మూడ్‌లో ఎలాంటి మార్పు రాలేదని గుర్తించారు. సినిమా చూస్తూ ఏడ్చిన వారు సినిమా అనంతరం కొద్దిసేపు బాధగా ఉన్నా 20 నిమిషాల్లో తిరిగి సినిమా స్క్రీన్ ముందరన్న మూడ్‌లోకి వచ్చేస్తారు. 
 
అంతేకాదు సినిమా చూసిన ఒకటిన్నర గంట తరువాత తామేంటో ఓ రకమైన భావనకు గురవుతున్నట్లు చెప్పారు. వర్క్ ప్లేస్‌లో అందరి మధ్య ఉన్నప్పుడు ఏడవడం నెగిటివ్ ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. దీనివల్ల వ్యక్తులకు లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుంది. మగవాళ్ళు ఏడవడాన్ని కొంత బలహీనతగా భావిస్తారు. పైగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు. ఒక అధ్యయనం ప్రకారం ఆడవాళ్ళు సగటున 47 సార్లు ఏడిస్తే మగవాళ్ళు ఏడుసార్లు మాత్రమే ఏడుస్తారని ఒక పరిశోధనలో తేలింది. 
 
యవ్వనంలోకి అడుగుపెట్టే వరకు ఆడ, మగపిల్లల ఏడుపులో తేడా ఉండదట. ఇద్దరూ సమానంగా ఏడుస్తారట. ఆ తరువాత టెస్టోస్టిరాన్స్ స్థాయిల కారణంగా అబ్బాయిల్లో ఏడుపు తగ్గుతుందట. అమ్మాయిలు ఎక్కువగా ఏడవడానికి ఈస్ట్రోజన్, కొలార్టిన్‌లు కారణమట. ఏడ్చిన తరువాత రిలాక్స్ అయ్యారా.. లేక ఇంకా వర్రీ అవుతున్నారా.. అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. డిప్రెషన్‌తో యాంక్సైటీతో బాధపడేవారు ఏడిస్తే అది వారికి మంచికన్నా చెడే చేస్తుంది. 
 
ఒత్తిడికి లోనై ఏడిస్తే ఊపిరిని మెల్లగా తీసుకుంటారు. ఏడుపులో ఉధ్రేకపడితే ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు కారణం జరుగుతాయట. అయితే ఏడవటం వల్ల శరీరంలోని విషతుల్యమైన రసాయనాలు బయటకు పోతాయట. మూడ్ బాగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎమోషనల్, ఫిజికల్ నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే ఎవరైనా ఏడుస్తుంటే వారిని ఓదార్పునివ్వడం కూడా ఎంతో అవసరమట. ఓదార్చడం వల్ల ఒక అండ దొరికినట్లు వారు ఫీలవుతారు. అది వారిలోని ఒత్తిడిని తగ్గిస్తుందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు