శరీరంలో అయోడిన్ లోపం వల్ల గాయిటర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. దీనిని నివారించేందుకు అతివలకు ఓ సులువైన మార్గం ఇది. మహారాష్ట్రలో మహిళలు ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ళలను విరివిగా వాడుతున్నారు. వీటిని నుదుటన పెట్టకుంటే, రోజుకు 100 నుంచి 150 మిల్లీ గ్రాముల అయోడిన్ శరీరంలోకి వెళ్లిపోతుందట. అందుకే రాత్రిళ్లు 8 గంటలపాటు ఈ బొట్టు పెట్టుకుని పడుకుంటే, అయోడిన్ లోపం నుంచి నివారణ పొందవచ్చట.
మన దేశంలో 71 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్నారని ఎన్.ఐ.డి.డి.సి. పి సర్వేలో వెల్లడి అయ్యింది. అందుకే మహారాష్ట్రలోని చాలా మంది మహిళలు ఈ అయెడిన్ బొట్టుబిళ్ళలను వాడుతూ, అయోడిన్ లోపాన్ని నివారించే మెరుగైన ఫలితాలను పొందుతున్నారు.