జుట్టు పెరగాలంటే ఆకుకూరలు తినండి..

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:53 IST)
జుట్టు బాగా వత్తుగా పెరగాలంటే ఆకుకూరలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, సీలు అవసరం. ఇవి సహజంగా వెంట్రుకల మొదటి నుంచి ఫాలికిల్ నుండి ఉత్పత్తి అవుతాయి. స్పీనాచ్, బ్రోకలీ వంటి వాటిలో ఈ పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా, ఆకుకూరల నుండి కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు. 
 
అలాగే నట్స్, బీన్స్ తీసుకున్నా జుట్టు బాగా పెరుగుతుంది. నట్స్ అధిక మొత్తంలో సెలీనియం కలిగివుంటాయి. ఆల్ఫా-లియోనిక్ ఆసిడ్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లను కలిగి ఉండే వాల్‌నట్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కావున జింక్ అధిక మొత్తంలో ఉండే బాదం, జీవిపప్పు, పీచెస్ వంటి వాటిని రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. అదేవిధంగా కిడ్నీ బీన్స్‌ను కూడా ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు  

వెబ్దునియా పై చదవండి