నిద్రలేమి, ఫుడ్ హాబిట్స్, మానసిక ఒత్తిళ్లు తలనొప్పికి కారణం అవుతాయి. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాఫీలోని కెఫిన్, పెరుగులోని టైరమైన్, పులుపు పదార్థాల్లో ఉండే సిట్రస్ తలనొప్పిని తెప్పిస్తాయి. మన తీసుకునే ఆహారంలో కొద్దిపాటి తేడాలతో తలనొప్పి రాకుండా చేసుకోవచ్చు.
వెన్న, మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలపోటు పెరుగుతుంది. విటమిన్-సి, డి, కాల్షియం, బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలా ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. పోషకాలున్న ఆహారాలతో పాటు, మంచి నిద్ర, కొద్దిపాటి వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
*యూకలిప్టస్ తైలం తలనొప్పి నివారిణిగా బాగా పని చేస్తుంది.
*గోరువెచ్చని ఆవుపాలు తాగినా తలనొప్పి నుంచి రిలాక్స్ అవ్వచ్చు.