చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి. కరక్కాయ కూడా పొడిదగ్గును తగ్గించడంలో దోహదపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి, ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు. పాలలో మిరియాల పొడిని వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.