మెంతి కూరను ఎలా తినాలో తెలుసా? అలా తింటే ఏం జరుగుతుందంటే?

మంగళవారం, 18 జులై 2017 (18:07 IST)
మెంతి కూర స్త్రీ అందాన్ని, ఆరోగ్యన్ని పెంచుతుంది. ఈ కూరను ఏ ఆకు కూరతో కలపకుండా విడిగా, పప్పుగానో, పచ్చడి, కూరగానో, వండుకొని తినాలి. ఇలా తినడం వలన నడుముకు బలం వస్తుంది. ఆడవాళ్ళలో తరుచూ కన్పించే సయాటిక్ నడుము నొప్పిలో మెంతికూర మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 
 
స్త్రీ, పురుషులలో లైంగిక సమర్థతని, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. రుతు సమయంలో రుతుస్రావం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. శరీరానికి నీరు వచ్చిన వారు మెంతికూరని రోజూ తింటే, నీరు తగ్గిపోతుంది.
 
గర్భాశయం లోపల దోషాల వలన కలిగే ముట్టు నొప్పులను ఇది తేలికగా తగ్గిస్తుంది. మెంతికూర రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. అలా చేయడం వలన జుట్టు మృదువుగా వుండే కేశరాసి లభిస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది.

వెబ్దునియా పై చదవండి