ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి. ఆశ్చర్యపోకండి, సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది.
ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.