పదమూడేళ్ల పిల్లవాడు తండ్రయ్యాడు

పదమూడు సంవత్సరాల బాలుడు తండ్రి అయ్యాడు. ఇది ఆశ్చర్యంగా వుంది కదూ. అతి పిన్న వయస్సులో తండ్రి పదవిని సొంతం చేసుకున్న ఘనుడని లండన్లోని ఓ పత్రిక ప్రచురించింది. వివరాలలోకి వెళితే...

బుల్లిపాపాయి కేవలం 1.22 మీటర్లేనని ఆ బాలుడు తన గర్లఫ్రెండ్‌(15)తో కలిసి ప్రేమాయణం సాగించాడని దాని ఫలితమే ఈ బుల్లిపాపాయని ఆ పత్రిక సారాంశం. ఆ పత్రిక తన వెబ్ సైట్లో చూపించిన చిత్రం చూస్తే అతను ఎనిమిది సంవత్సరాల వయస్సువానిగా కనపడుతున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ తను గర్భనిరోధక మాత్రలను వాడినప్పటికీ గర్భం రావడం ఆగలేదని తెలిపింది.

ప్రత్యేకంగా ఈ పిల్లవాని గురించి తనకు తెలియదని, కాని యువావస్థలో గర్భం ధరించడాన్ని తాము నిరోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి గోర్డన్ బ్రౌన్ తెలిపారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైనాయని వీటిని నిరోధించడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.

అతి పిన్న వయస్సులోనే తల్లిదండ్రులుగా మారుతున్న బాలబాలికల శాతం యూరోప్ దేశంలోనే అత్యధికంగావున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 సంవత్సరాలలోపున్న అమ్మాయిలు తల్లులవుతున్నారని 2006లో వీరి సంఖ్య 39వేలమంది అమ్మాయిలని అందునా వీరిలో 7వేలమంది 16 సంవత్సరాలలోపువారేనని తెలిసింది.

ప్రతి వెయ్యిమంది అమ్మాయిలలో అతి పిన్న వయస్కులలో తల్లులౌతున్న వారు 27 శాతం మంది వున్నారని, ప్రతి వెయ్యిమందిలో స్పెయిన్‌లో పదిశాతం, ఫ్రాన్స్‌లో ఎనిమిది శాతం, నెదర్లాండ్స్‌లో ఐదు శాతం వున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

ఇలాంటి వాటిని నివారించడానికి ఉన్నత పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు బ్రిటిష్ విద్యాశాఖాధికారులు తెలిపారు. ఇది ప్రాథమికోన్నత పాఠశాలనుంచే ప్రారంభించాలని తాము భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి