కాగా, కాశ్మీర్ అంశంలో భారత్‌పై సౌదీ అరేబియాను ఎగదోయాలనుకున్న పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం (ఓఐసీ) కాశ్మీర్ అంశంలో తగిన రీతిలో స్పందించడంలేదని, ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని పాక్ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేసింది.
ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం కూడా ఉందని పాక్ విదేశాంగ మంత్రి బెదిరింపు స్వరం వినిపించారు. 57 దేశాల సభ్యత్వం ఉన్న ఓఐసీని కాశ్మీర్ అజెండాపై సమావేశపర్చడంలో విఫలమవుతున్నారంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, కాశ్మీర్ అంశంపై తామే ఓఐసీని సమావేశపర్చుతామని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాము అందించిన 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును సౌదీ నుంచి రాయితీపై పొందే ఒప్పందం కూడా పాక్‌కు దూరంకానుంది. ఇటీవల ఒప్పందం ముగిసినా మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, పాక్ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న సౌదీ ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకుంది. దాంతో పాక్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.