లైవ్‌లో వికటించిన ప్రయత్నం.. ఆస్పత్రి పాలైన వీడియో బ్లాగర్.. (Video)

బుధవారం, 5 జులై 2017 (10:32 IST)
ఓ వీడియో బ్లాగర్ లైవ్‌లో చేసిన ప్రయత్నం వికటించింది. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. ఇంతకీ లైవ్‌లో ఆమె చేసిన ప్రయత్నమేంటో ఓసారి పరిశీలిద్దాం. చైనాకు చెందిన ఓ హెల్త్ వీడియో బ్లాగర్ చాంగ్ (24) అనే యువతి కలబంద (అలోవెరా) అనుకుని ప్రమాదవశాత్తు అలాగే ఉండే అగావె అమెరికానా(విషపు మొక్కను) లైవ్‌లో నమిలింది. 
 
అలా చేసిన కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చాంగ్ ఆ మొక్కను కొరుకుతూ ‘‘ఊ.. ఇది చాలా బాగుంది’’ అని అనడం వీడియోలో వినిపించింది. ఆ తర్వాత ఆమె అస్వస్థతకు లోనైంది. 
 

వెబ్దునియా పై చదవండి