ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40 శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి భారత్ అండగా నిలిచింది. రెండోదశలో మహమ్మారి విజృంభణతో టీకాల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే.