ఐసిస్ వ్యవస్థాపకుడు బరాక్ ఒబామానే : డోనాల్డ్ ట్రంప్ ఆరోపణ

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:45 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ వ్యవస్థాపకుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానేనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఎన్నికల సమయం సమీపించే కొద్దీ ఆయన విమర్శలతో దాడిని పెంచారు. 
 
ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రాటిక్ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఊతం ఇస్తోందంటూ ఆరోపణలు చేసిన ట్రంప్.. తాజాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ను స్థాపించింది ఒబామాయే అని ఏకంగా దేశాధ్యక్షునిపైనే నిందలు వేశారు. బరాక్ హుస్సేన్ ఒబామా అని అధ్యక్షుడిని పూర్తి పేరు ఉటంకిస్తూ ఆయనను వారు అన్ని విధాలా గౌరవిస్తారని ట్రంప్ అన్నారు. బుధవారం ఫ్లోరిడాలోని లాడర్‌డేల్ ఖిలా వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి