హిల్లరీపై డొనాల్డ్ ట్రంప్ గెలుపు: మెలినియా ట్రంప్‌ గురించి మీకు తెలుసా?

బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (10:25 IST)
అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్ సెనెటర్, వివాదాస్పద వ్యాఖ్యల డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల అయోవా ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. అమెరికా అధ్యక్ష పదవి బరిలో దిగాల్సిన వారెవరో నిర్ణయించే ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా న్యూహాంప్ షైర్‌లో ప్రత్యర్థిపై డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించారు. ఇదే సమయంలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, డెమొక్రటిక్ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్ ఓడిపోయారు. 
 
హిల్లరీపై ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ భారీ గెలుపును నమోదు చేసుకున్నారు. ఇంకా తాను ఓటమిని అంగీకరిస్తున్నానని, తదుపరి సౌత్ కరోలినా, నెవాడా రాష్ట్రాల్లో ప్రచారంపై దృష్టిని సారిస్తానని హిల్లరీ క్లింటన్ ప్రకటించారు. కాగా, రిపబ్లికన్ల తరఫున ట్రంప్‌తో పాటు ట్రెడ్ క్రూజ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ సతీమణి మెలినియా ట్రంప్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెలేనియా స్లోవెనియాకు చెందిన వలసదారు అయిన ఆమె... 2005లో బిలియనీర్ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లాడిన తర్వాతే ఆమె అమెరికా పౌరసత్వం పొందడం విశేషం. 
 
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైతే.. అమెరికా మొదటి పౌరురాలి (ఫస్ట్ లేడీ)గా కీర్తి పొందిన రెండో విదేశీయురాలిగా ఆమె గుర్తింపు పొందనున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్వీన్సీ ఆడం సతీమణి లూసియా కూడా ప్రవాసురాలే కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి