నైజీరియాలో వయసు పైబడిన వారిని ఎంచుకొని.. ఉగ్రవాదులు పెద్దఎత్తున ఊచకోతలకు పాల్పడుతున్నారు. గ్వోజా ప్రాంతంలో ఇటీవల 50 మంది వృద్ధులను వరసగా నిలబెట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్చేశారు. దానివల్ల ప్రజల్లో ఎక్కువ భయాన్ని సృష్టించగలుగుతామని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ సైనిక వర్గాలు వెల్లడించాయి.