దాదాపు 60 ఏళ్ల క్రితం, 1946లో కూబర్ పెడీ అనే ఓ ఎడారి పట్నంలో వాల్టర్ బార్టమ్ అనే మైనర్ దీన్ని కనుగొన్నారు. సహజంగా సప్త రంగులు కనిపించే ఇలాంటి ఇంద్రనీల రత్నంపై నీలి రంగు ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది. దీనికి ఎరుపు రంగు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మరింత విలువైనదిగా ప్రసిద్ధికెక్కింది.
ప్రపంచంలో 90 శాతం రత్నాలు దక్షిణ ఆస్ట్రేలియాలోనే తయారవుతాయని, రత్నాల మైనింగ్, పంపిణీ బిజినెస్ కలిగిన వాల్టర్ బార్టమ్ తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా దీన్ని సేఫ్ లాకర్‌లో భద్రపర్చామని తెలిపారు.