22ఏళ్ల యువకుడిపై పోలీసులు అత్యాచారం చేశారనే ఆరోపణలపై ప్రజలు పోలీసులను తీరును ఎండగడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ప్రజల ప్రాణాలను హరించారు.. పోలీసుల తీరును నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పోలీసుల ఉన్మాదానికి నిరసనగా ఫ్రాన్స్‌లో ఆందోళనకారులు వీధి బాట పట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ సుమారు రెండువేల మంది బోబిగ్నిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్ళు విసిరారు.
ఇంకా ఆందోళనకారులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మార్పిల్లీలోనూ పోలీసుల చర్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడిపై అత్యాచారం జరిపారనే ఘటనపై ఓ పోలీసుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అత్యాచారానికి గురైన 22 ఏళ్ళ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.