ట్రంప్ పై జార్జిబుష్‌ ఫైర్

బుధవారం, 3 జూన్ 2020 (19:39 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ఫైర్ అయ్యారు. నల్లజాతీయుడు జార్జి ఫ్లయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై పరోక్షంగా ట్రంప్ కు చురకలంటించారు. దేశం ఎదుర్కొంటున్న విషాద వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

నిరసనలే తమ దేశ బలమని, వాటిని అణిచివేయాలని చూసే వారికి అమెరికా అంటే అర్ధమే తెలియదని అన్నారు. పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, తన పార్టీకే చెందిన డొనాల్డ్‌ట్రంప్‌కు చురకలు అంటించారు.

సొంత దేశంలోనే ఆఫ్రో అమెరికన్లపైన దాడులు జరగడం ఇక్కడి వ్యవస్థల వైఫల్యమని బుష్‌ పేర్కొన్నారు. వివిధ నేపథ్యాలున్న ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడమే అసలైన సమస్య అన్నారు.

అయితే ఆందోళనకారులు శాంతియుతంగా ఉద్యమించాలని కోరారు. దోపిడి వల్ల స్వేచ్ఛ, విద్వంసం వల్ల ప్రగతి సాధ్యం కావని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు