లైవ్ షోలో డ్యాన్సర్లపై జారిపడిన ఎల్ఈడీ స్క్రీన్

శుక్రవారం, 29 జులై 2022 (13:25 IST)
Hong kong
లైవ్ షోలు జరిగేటప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా హాంకాంగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. 
 
హాంకాంగ్‌లోని ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ షోకోసం స్టేజ్‌పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
స్టేజ్‌పై డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్లుండి ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే తోటి డ్యాన్సర్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు