తలపాగాలో బాంబుతో హమీద్ కర్జాయ్ సోదరుడి హతం!

బుధవారం, 30 జులై 2014 (10:54 IST)
ముస్లింల పర్వదినమైన రంజాన్ పండుగ రోజున ఆప్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇంట విషాదం నెలకొంది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తలపాగాలో బాంబు పెట్టుకుని వచ్చి తననుతాను పేల్చుకోవడంతో కర్జాయ్‌కి వరుసకు సోదరుడైన హష్మత్ ఖలీల్ కర్జాయ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కర్జాయ్ కుటుంబం రంజాన్ రోజున విషాదంలో మునిగిపోయింది. 
 
రంజాన్ ప్రార్థన తర్వాత హష్మత్‌కు శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటికొచ్చిన బాంబర్ ఆయనతో కరచాలనం చేసి, తన తలపాగాలో దాచిన బాంబులను పేల్చేసుకున్నాడు. దీంతో బాంబర్‌తో పాటు.. హష్మత్, మరికొంతమంది ప్రామాలు కోల్పోయారు. 2011 సెప్టెంబర్‌లో అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు రబ్బానీ కూడా అచ్చం ఇలాంటి దాడిలోనే చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి