భారత్ దౌత్య విజయం : కుల్‌భాషణ్‌ను కలిసి అధికారులు

సోమవారం, 2 సెప్టెంబరు 2019 (17:16 IST)
అంతర్జాతీయంగా భారత దౌత్య అధికారులు విజయం సాధించారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు ఎట్టకేలకు భారత్‌కు దౌత్యపరమైన అనుమతులు లభించాయి. 
 
ఈ క్రమంలో భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా కొద్దిసేపటి క్రితం పాక్ జైల్లో మగ్గిపోతున్న కుల్ భూషణ్ జాదవ్‌ను కలిశారు. కుల్ భూషణ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అహ్లూవాలియా, అతడిపై ఉన్న ఆరోపణలు, వాటి విచారణ, ఇటీవల అంతర్జాతీయ నేర న్యాయస్థానం కేసు తీర్పు వంటి విషయాలను చర్చించారు.
 
కుల్ భూషణ్‌కు దౌత్యపరమైన మద్దతు అందించడంలో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. తమదేశంలో గూఢచర్యం చేస్తున్నాడంటూ పాక్ కుల్ భూషణ్‌ను అదుపులోకి తీసుకుని ఏకపక్ష విచారణతో మరణశిక్ష విధించింది. అయితే, అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో వెనక్కి తగ్గింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు