చైనా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు.. క్లినిక్స్ పెంచాలని..?

ఆదివారం, 26 నవంబరు 2023 (18:50 IST)
చైనా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శ్వాసకోస సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఆరోగ్య శాఖ సైతం అప్రమత్తమైంది. ఫీవర్ క్లినిక్‌లను పెంచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. 
 
కోవిడ్-19 నిబంధనలను సడలించిన తర్వాత చైనాలో ఇదే తొలి చలి కాలం కావడంతో.. ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. చైనాలో గుర్తించని న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతుండటంతో.. న్యుమోనియా కేసులకు సంబంధించి మరింత సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం చైనాను కోరిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు చైనా న్యూమోనియా కేసులు పెరగడంతో రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ సమయంలో ఎలా అప్రమత్తంగా వ్యవహరించారో అదే తరహాలో ఉండాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు