హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్న ఆమె తన మొహం మీదకు అమెరికన్ వచ్చి అరుస్తున్నా తొలుత పట్టించుకోలేదు. ప్రవర్తన తీవ్రంగా ఉండటంతో హెడ్ఫోన్లు తీసేసింది. అప్పుడు వాడు ‘మీ దేశానికి వెళ్లిపో’ అని హూంకరించాడు. ‘నన్ను తాకొద్దు’ అని హెచ్చరించినా వినకుండా బెదిరిస్తూ.. భయపెడుతూ.. మీది మీది కొచ్చి సభ్యసమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరమైన భాషలో బూతులు తిట్టాడు.
ఎక్తా దేశాయ్ రియాక్ట్ కాకపోవడంతో అతను పక్కనున్న ఆసియన్ మహిళ మీద తన తిట్ల ప్రతాపం చూపించాడు. అతడి విద్వేషాన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించిన ఎక్తా దేశాయ్ మొదట దాన్ని బయట పెట్టలేదు. కాన్సస్‌లో జాతి విద్వేష దాడిలో శ్రీనివాస్ మరణం తర్వాత ఫేస్బుక్లో పోస్టు చేసింది. అతను అసభ్యంగా ప్రవర్తించిన పావు గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారని, వారేమీ అతనిపై చర్య తీసుకోలేదని పేర్కొంది.