అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవాలి... ఉగ్రవాదులు ప్రార్థనలు... ఎందుకంటే...?

మంగళవారం, 30 ఆగస్టు 2016 (21:29 IST)
ఇదేంటి...? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని ఉగ్రవాదులు ఎందుకు ప్రార్థనలు చేస్తున్నట్లు? హిల్లరీ క్లింటన్ గెలిస్తే వారికి వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు ట్రంప్ విజయం కోసం వారు ఎందుకు అంతలా ప్రార్థనలు చేస్తున్నారయా అంటే, ఓ లెక్కుందని చెపుతున్నారట. ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ వెల్లడించిన వివరాలను చూస్తే... అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఆయన వ్యాఖ్యలు, దూకుడు నిర్ణయాలు తమకు చాలా చాలా అనుకూలమని వారు అభిప్రాయపడుతున్నారట. 
 
ట్రంప్ నిర్ణయాలతో అమెరికా స్వీయ వినాశనం చెందుతుందని ఐసిస్ ఉగ్రవాదులు అనుకుంటున్నారట. ఈ విషయాలను ఎఫైర్స్ మేగజైన్ వెల్లడించింది. ఐతే తను అధ్యక్ష పదవి చేపడితే ఉగ్రవాదులను ఏరివేస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐతే ఇలాంటి నిర్ణయాలు, వ్యాఖ్యలే తమకు బాగా అనుకూలిస్తాయనీ, తద్వారా ఇస్లామిక్ స్టేట్ బలోపేతం అవుతుందని వారు అనుకుంటున్నారట. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని వారు ప్రార్థనలు చేస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి