బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో పోటీపడిన భారత సంతతి మూలాలు ఉన్న రిషి సునక్‌కు ఆ దేశ ప్రజాప్రతినిధులు, పౌరులు తేరుకోలేని షాకిచ్చారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ ఎంపికయ్యే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 90 శాతం మంది ప్రజా ప్రతినిధులు లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చివరి దశకు చేరుకుంది.
బ్రిటన్ వ్యాప్తంగా గత ఆరు వారాల హస్టింగ్స్ పర్యటనలో, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ వర్సెస్ ట్రస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. వీరిద్దరూ 1,75,000 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల మద్దతు కోసం పోటీపడ్డారు.