తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఆర్నాల్డ్ దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన క్లాసిక్ ఆఫ్రికా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అభిమానులతో పాటు ప్లేయర్స్‌తో సరదాగా సంభాషిస్తూ ఆర్నాల్డ్ స్నాప్ చాట్ వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఓ అజ్ఞాతవ్యక్తి వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్నాల్డ్‌ని తన్ని అతనే కింద పడ్డాడు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పైగా, "నన్ను ఎవరో తన్నారని వీడియో చూస్తే కాని తెలియదు. ఆ ఇడియట్ నా స్నాప్ చాట్ వీడియోని నాశనం చేయనందుకు సంతోషం. మీరందరు నాకు ఓ సాయం చేయాలి. ఒక వేళ మీరు ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటే ఆ వ్యక్తి అరుపులు వినిపించకుండా ఉన్న వీడియోని చేయండి. ఆ వ్యక్తి అస్సలు పాపులర్ కాకూడదు. దక్షిణాఫ్రికాలోని ఆర్నాల్డ్ స్పోర్ట్స్ క్లబ్‌లో 90 రకాల క్రీడలు ఉన్నాయి. 24 వేల అథ్లెట్లు ఉన్నారు. ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దాం" అని ఆర్నాల్డ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.