ఈ దాడి గురించి మౌలానా వివరిస్తున్న ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇండియన్ ఫైటర్ జెట్స్ సరిహద్దు దాటి ఓ ఇస్లామిక్ దేశంలోకి వచ్చి ఇక్కడి ముస్లింల సెంటర్‌పై దాడి చేసిందని మౌలానా అందులో చెప్పడం వినిపిస్తుంది. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఏ ఏజెన్సీపైగానీ, ఏ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్స్‌పై కానీ బాంబులు వేయలేదు.
కాశ్మీర్‌లో ముస్లింలకు సాయం చేసే జిహాద్‌ను నేర్చుకుంటున్న విద్యార్థుల సెంటర్‌పై ఈ దాడి జరిగింది అని మౌలానా స్పష్టం చేశాడు. ఈ చర్యతో శత్రువు మనపై యుద్ధం ప్రకటించాడు, మన కేంద్రంపై దాడి చేసి ఇక తమపై జిహాద్ మొదలుపెట్టవచ్చని ఇండియా స్పష్టం చేసిందని మౌలానా చెప్పడం గమనార్హం.