అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన భార్య మిలానియా ట్రంప్ మద్దతు తెలిపారు. ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చాక మొట్టమొదటిసారి ఆయన సతీమణి స్పందించారు. అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని ట్రంప్ అభ్యర్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పన్నిన వ్యవస్థీకృత కుట్రగా ఆమె తేల్చేశారు. ట్రంప్‌పై ఆరోపణలు చేసిన మహిళల చరిత్ర మీడియాకు తెలుసా అని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మిలానియా అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా ప్రసంగాన్ని కాపీ కొట్టారని వార్తలొస్తున్నాయి. క్లీవ్‌ల్యాండ్‌లో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో మిలానీయా సభను ఉద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అయితే ఈ ప్రసంగంలో మిషెల్ ప్రసంగాన్నే చదివి వినిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.