ఫిలిప్పీన్స్‌లోని జైలులో అగ్నిప్రమాదం: 9 మంది సజీవదహనం

శుక్రవారం, 9 అక్టోబరు 2015 (16:58 IST)
ఫిలిప్పీన్స్‌లోని ఓ జైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. ఈ ప్రాంతం ఆ దేశ రాజధాని మనీలాకి 386 మైళ్ల దూరంలో ఉంది. లేటీ ద్వీపంలోని రీజినల్‌ జైలులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
సైకియాట్రిక్‌ వార్డులో ఈ ప్రమాదం జరగడంతో మృతుల్లో చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని ఖైదీలే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగినా దాదాపు 8 గంటల పాటు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయని, ఓ భవనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. 
 
ఈ ఘటనలో తొమ్మిది మంది ఖైదీలు మృతిచెందినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. జైలు వార్డెన్లు ఖైదీలను కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. అర్థరాత్రికి మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి