మరో హైడ్రోజన్ బాంబు తయారీకి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (16:31 IST)
ఉత్తర కొరియా మరో హైడ్రోజన్ బాంబు తయారీకి సిద్ధమవుతోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. హైడ్రోజన్‌ బాంబును ప్రయోగించామని ప్రకటించుకున్న ఉత్తర కొరియా మరో భారీ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. పశ్చిమదేశాలు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్షిపణికి 3 వేల 4 వందల మైళ్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే సత్తా ఉన్నట్లు తేలింది. 
 
పైగా, దీనికి అణ్వాయుధాలు తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్నట్లు పాశ్చత్య దేశాలు అనుమానిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిని ప్రత్యేకంగా సమావేశపరిచి దాయాది దేశాలపై చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియా మరింతగా డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు.. అగ్రదేశం అమెరికా కూడా ఉత్తర కొరియా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని ఆరోపించింది. ఇటీవలే హైడ్రోజన్‌ బాంబ్‌ను ప్రయోగించామన్న ఉత్తర కొరియా ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఉత్తర కొరియాకు చైనా మంచి మిత్ర దేశం అయినా చైనా సలహా కూడా ఉత్తర కొరియా పట్టించుకోవడం లేదు కదా ఇపుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి