పాక్ సముద్ర హద్దుల్లో 61 మంది భారతీయ జాలర్లు అరెస్ట్
శనివారం, 22 నవంబరు 2014 (13:07 IST)
పాకిస్తాన్ ప్రాదేశిక సముద్ర హద్దుల్లోకి ప్రవేశించిన 61 మంది భారతీయ జాలర్లును ఆ దేశ మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న 11 బోట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా డాన్ శుక్రవారం వెల్లడించింది.
భారత జాలర్లు పాక్ సముద్ర హద్దుల్లోకి ప్రవేశించినా లేక పాక్ జాలర్లు భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినా వారిపై ఆయా దేశాల మెరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.