పాక్ ఆక్రమిత కాశ్మీల్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారత్లోని పాకిస్థాన్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ ఈ దాడులపై స్పందించారు.
భారత ఆర్మీ జరిపిన దాడులు సర్జికల్ దాడులు కావనీ, ఉత్తుత్తి దాడులేనని వ్యాఖ్యానించారు. 'సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినా పాక్ తిప్పికొడుతూ వస్తోంది. పాక్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు' అని బాసిత్ తెలిపారు.
అదేసమయంలో ఇస్లామాబాద్ ఎప్పుడూ న్యూఢిల్లీతో ఉద్రిక్తతలను కోరుకేలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒకవేళ లక్షిత దాడులు జరిగి ఉంటే పాకిస్థాన్ తక్షణం తిప్పికొట్టేదని తాను చెప్పగలనని, భారత్ వైపు నుంచి ఎలాంటి చర్చలు తీసుకున్నా పాక్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.