ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం.. త్వరలో 500 మంది ఉగ్రవాదులకు ఉరి!

సోమవారం, 22 డిశెంబరు 2014 (18:45 IST)
ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోంది. పెషావర్‌ సైనిక పాఠశాలపై తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన తర్వాత కళ్లు తెరిచిన పాకిస్థాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు శ్రీకారం చుట్టుంది. ఇందులోభాగంగా... వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఉగ్రవాదులను ఉరి తీయాలని నిర్ణయించి, ఇప్పటికే 8 మందికి శిక్షలను అమలు కూడా చేసింది. 
 
తాజాగా త్వరలోనే మరో సుమారు 500 మంది ఉగ్రవాదుకు ఉరిశిక్ష అమలు చేస్తామని పాకిస్థాన్ మంత్రి ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు శిక్షలను వేగవంతం చేయనున్నామని పాక్ స్పష్టం చేసింది. పాక్ మంత్రి ప్రకటన వాస్తవరూపం దాలిస్తే, ప్రపంచ ఉగ్రవాద సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే. తీవ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో కఠిన చర్యలు తీసుకుంటే తీవ్రవాదులు నిలువ నీడ కోల్పోయినట్టే! 

వెబ్దునియా పై చదవండి