నిజానికి మనీలాండరింగ్ కేసులో షరీఫ్‌కు జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ముఖ్యంగా, రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని, మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేయడంతో లాహోర్ కోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా ఆయన లండన్‌కు వెళ్లిపోయారు.
లండన్‌లోని రెస్టారెంటులో షరీఫ్.. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతడి కుమారుడు హంజాలతో కలిసి కూర్చొని ఉన్నట్లు ఈ ఫొటోలో స్పష్టంగా కనపడుతోంది. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా స్పష్టమవుతోంది. ఈ ఫొటో పాక్‌లో తీవ్ర చర్చనీయాశంగా మారింది.