దక్షిణ కొరియా రచయిత్రికి నోబెల్ పురస్కారం

ఠాగూర్

గురువారం, 10 అక్టోబరు 2024 (18:47 IST)
సాహితీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ ప్రైజ్‌ విజేతను గురువారం ప్రకటించారు. ఈ పురస్కారం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు వరించింది. చారిత్రక వేదనలతో సంఘర్షిస్తూ, మానవ జీవిత దౌర్భల్యాన్ని ఎత్తి చూపేలా తీవ్రతతో కూడిన వచన కవిత్వం హాన్ కాంగ్ కలం నుంచి జారువారిందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. 
 
53 యేళ్ల హాన్ కాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి. ఆమె తండ్రి హాన్ సంగ్ ఒన్ కూడా ఒక నవలా రయితే. సాయితీ కుటుంబంలో పుట్టిన హాన్ కాంగ్, యాన్సెల్ యూనివర్శిటీ నుంచి సాహిత్యంలో డిగ్రీ స్వీకరించారు. అనేక రచనలతో కొరియా సాహితీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు