ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు బృందం టాప్-10లో నిలిచి 25 వేల డాలర్లు (సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా నాసా గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది.
రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్, అమరేశ్వర ప్రసాద్ చుండూరు, ప్రణవ్ ప్రసాద్ రూపొందించిన ఎల్-వాటర్(లూనార్ వాట ర్ అబ్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బై ఎక్సకవేషన్ ఆఫ్ రెగోలిత్) ప్రాజెక్ట్ టాప్-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది.