కాలిఫోర్నియాలోని ఓ ప్రచార ర్యాలీలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికన్-అమెరికన్ మద్దతుదారుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ర్యాలీలో మాట్లాడుతూ.. ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ను సూచిస్తూ అతడు తనకు మద్దతిస్తున్నాడని.. అతడుగొప్ప వ్యక్తి అని.. ఎందుకంటే తాను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోగలుగుతున్నాడని ట్రంప్ పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో ఎక్కువ సేపు డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్‌పై విమర్శలు చేయడానికే కేటాయించారు. ఈ నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్-అమెరికన్ తనకు మద్దతివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను తాను తిరిగి తీసుకురాగలనని అందుకే తనకు అంతా మద్దతిస్తున్నారని ట్రంప్ తెలిపారు.