ముగ్గురు కలిసి ఓ బిడ్డకు జన్మ... బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం..!

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (15:45 IST)
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్‌లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు. 
 
కనుక ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా కల్గి ఉన్న వేరొక మహిళ నుండి దాన్ని జన్మనిచ్చే తల్లికి అందించి ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని ప్రసాదించవచ్చనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం. ఈ బిల్లుకి బ్రిటన్ పార్లమెంట్ అనుమతి తెలపడంతో త్రీ పేరెంట్ బేబి 2016లోగా జన్మించే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి