ఈ టీవీ డిబేట్‌లో ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఇరువురు అభ్యర్థులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ.. 'పన్నుల తగ్గింపు కంటే ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్ రేట్లు పెరుగుతాయి. మన సేవింగ్స్, పింఛన్లు అన్నీ ఆవిరవుతాయి' అని వివరించారు.
అనంతరం లిజ్ ట్రస్ మాట్లాడుతూ.. అధిక పన్నుల వల్లే బ్రిటన్‌లో మాంద్యం భయాలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ వాదనను సునాక్ తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం వల్లే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇరువురి వాదనలు పూర్తయిన తర్వాత స్టూడియోలోని ఆడియన్స్‌కు ఓటింగ్ పెట్టారు. ఇందులో ఎక్కువ మంది రిషి సునాక్‌కు మద్దతుగా ఓటువేశారు. ఈ టీవీ డిబేట్‌లో ఆయన విజయం సాధించనట్టు ప్రకటించారు.