అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేనా, ఆయనకు చెందిన రాజకీయ పార్టీపై కూడా నిషేధం విధించింది.
అలాగే, జమాత్ ఉద్ దువా ప్రధాన కార్యాలయంతో పాటు 26 ప్రాంతీయ కార్యాలయాల ముందు ఉన్న బారికేడ్లను సోమవారం తొలగించినట్లు పాక్ ప్రకటించింది. యూఎన్ఎస్సీ నిషేధం విధించిన జమాత్ ఉద్ దువా, లష్కరే తోయిబా, అల్‌ఖైదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో పాటు పలు ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద జాబితాలో పాకిస్థాన్ చేర్చింది.