అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏ మాత్రం గౌరవించడం లేదని అన్నారు. చైనా, అమెరికా ఉన్నత స్థాయి అధికారులు మరికొన్ని రోజుల్లో స్విట్జర్లాంట్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆఫ్గాన్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణ సరైన చర్య కాదని అన్నారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను ఆఫ్గాన్‌లో వదిలేసి వచ్చామని, ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటున్నాయని ట్రంప్ ఆరోపించారు.