చెన్నై సూపర్ కింగ్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

సెల్వి

గురువారం, 15 ఫిబ్రవరి 2024 (13:35 IST)
చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గత సీజన్‌లో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో సీఎస్‌కే విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న చెన్నై ఈ సీజన్‌లోనూ కప్‌ను సాధించాలని కసితో ఉంది. 
 
ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్పాన్సర్ ఎతిహద్‌ ఎయిర్‌వేస్‌కు కత్రినా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహద్ ఎయిర్‌వేస్ కంపెనీకి సీఎస్‌కే స్పాన్సర్‌షిప్ హక్కులు ఇచ్చింది. 
 
ఎతిహద్‌కు ప్రచారకర్తగా ఉన్న కత్రినాకైఫ్ ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగనుంది. ఆమె రాబోయే రోజుల్లో ధోని మరియు ఇతర ఆటగాళ్లతో కలిసి యాడ్స్ షూటింగ్‌లో పాల్గొంటుంది. గతంలో ఈ బాలీవుడ్ బ్యూటీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు