ముస్లిం సోదరులు ఈ మాసమంతా ఉపవాస దీక్షను పాటించి మాస చివరన అత్యంత పవిత్రంగా "రంజాన్" పండుగను జరుపుకుంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం 'ఉపవాసవ్రతం'. ముస్లిం సోదరులు కూడా 'చాంద్రమాన కేలండర్'ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్'గా పరిగణింపబడుతోంది.