ఓ వైపు పెద్ద సైజ్ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో అతి చిన్న స్మార్ట్ ఫోన్ జెల్లీని రూపొందించింది... చైనాకు చెందిన యునిహెర్జ్ సంస్థ. త్వరలో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2.45 అంగుళాల సైజు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌తో జెల్లీ, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో జెల్లీ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
అరచేతిలో సులువుగా ఇమిడిపోయే ఈ చిన్ని స్మార్ట్‌ఫోన్ నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఈ ఫోన్ ఐదువేల రూపాయల్లోపు లభిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా 1.1 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్‌లో 32 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. వెనక 8ఎంపీ, ముందు 2ఎంపీ కెమెరా పొందుపరిచారు. రెండు నానో సిమ్‌కార్డులు, 950 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లని యునిహెర్జ్ సంస్థ ప్రకటించింది.