మొబైల్ యాప్‌ల వినియోగం: అమెరికాను వెనక్కి నెట్టిన భారత్

శుక్రవారం, 19 జనవరి 2018 (16:22 IST)
మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టింది. అగ్రస్థానంలో చైనా నిలిచింది. టెలికామ్ రంగంలోకి జియో వచ్చాక ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. 
 
దీంతో యాప్ డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా అగ్ర‌రాజ్యం అమెరికాను కూడా భార‌తదేశం దాటే స్థాయికి ఎదిగింది. ఎక్కువగా ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్‌ తొలిస్థానంలో ఉండ‌గా, ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ట్రూకాలర్‌, షేర్‌ఇట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, యూసీ బ్రౌజర్‌, అమేజాన్‌, పేటీఎం, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి.
 
యాప్ ఆనీ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2017లో మన దేశంలో యాప్‌ల వినియోగం 215 శాతం పెరిగింది. సగటున భారతీయులు నెలకు 40 కంటే ఎక్కువగా యాప్‌లను వినియోగిస్తున్నారని నివేదికలో తేలింది. అమెరికాతో పోల్చితే యాప్‌ల వినియోగం భారత్‌  కంటే 5 శాతం తగ్గిందని నివేదిక వెల్ల‌డించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు